¡Sorpréndeme!

PBKS Great Victories in IPL 2025 | ఊహించని రీతిలో విజయాలు సాధిస్తున్న పంజాబ్ కింగ్స్

2025-04-19 0 Dailymotion

 ఈ సీజన్ లో తిరుగులేని ఫామ్ ను చూపిస్తూ దూసుకెళ్లిపోతోంది పంజాబ్ కింగ్స్. శ్రేయస్ అయ్యర్ స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీలో నమ్మశక్యంగా లేని విజయాలను అందుకుంటూ అందరికీ షాకులు ఇస్తోంది ప్రీతి జింటా టీమ్. ఇప్పటివరకూ 7 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ అందులో 5 మ్యాచులు గెలిచి రెండింటిలో ఓడిపోయింది. కేవలం రాజస్థాన్, హైదరాబాద్ జట్లే ఇప్పటివరకూ పంజాబ్ ను ఓడించాయి. ప్రస్తుతం పదిపాయింట్లతో పాయింట్స్ టేబుల్ లో రెండో స్థానంలో పంజాబ్ కింగ్స్...గత మూడు మ్యాచుల్లో చాలా ఎక్స్ ట్రీమ్ కండీషన్స్ లో మ్యాచ్ లను ఆడుతోంది. ఉదాహరణకు లాస్ట్ మూడు మ్యాచులు చూసుకుంటే హైదరాబాద్ తో ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో 245 పరుగులను స్కోరు చేసింది పంజాబ్ టీమ్. ఇది పంజాబ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు. కానీ ఇంత స్కోరు కొట్టినా కూడా అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఆ టార్గెట్ ను ఛేజ్ చేసి పారేశాడు. చరిత్రలోనే అత్యధిక స్కోరు కొట్టినా పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఆతర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడింది పంజాబ్. ముల్లాన్ పూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఏముంది పంజాబ్ మళ్లీ ఓడిపోతుంది అనుకున్నారు కానీ కేకేఆర్ ను అనూహ్యంగా 95 పరుగులకే ఆలౌట్ చేసి పంజాబ్ మళ్లీ విజయంలోకి దూసుకువచ్చింది. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా రెండు గంటలు తుడుచుకపెట్టుకోపోయింది. అయినా 14 ఓవర్లకు జరిగిన మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ని పంజాబ్ బౌలర్లు భయపెట్టి కేవలం 95 పరుగులకే పరిమితం చేశారు.    అంత చిన్న టార్గెట్టే అయినా దాన్ని పడుతూ లేస్తూ 5 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది పంజాబ్. ఫలితంగా ఆర్సీబీని సొంత గ్రౌండ్ లో భలే భయపెట్టింది. ఓ టైమ్ లో 49 కంటే తక్కువ పరుగులకు ఆర్సీబీని ఆలౌట్ చేసి మహా దారుణమైన రికార్డును వాళ్లకు గిఫ్ట్ ఇస్తుందా అనేంతలా భయపెట్టారు కూడా పంజాబ్ బౌలర్లు. ఇంతటి ఎక్స్ ట్రీమ్ కండీషన్స్ లో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నా లేకున్నా భారీ విధ్వంసాలతోనో, లో స్కోర్ థ్రిల్లర్స్ నో ధైర్యంగా ఆడేస్తూ పరిస్థితి ఏదైనా మ్యాచ్ లను గెలవటానికి మాత్రం పంజాబ్ కింగ్స్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. సూపర్ ఆట తీరుతో సక్సెస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో పైపైకి వెళ్తోంది  పంజాబ్ కింగ్స్.